News Friday, March 27, 2026 - 10:01

Select District: 
News Items: 
Description: 
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్! AP Teacher Jobs | ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. అయితే ఇందులో భాగంగా 3000కు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేసింది. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్ AP DSC Notification 2026 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉగాది పండుగ పురస్కరించుకుని రేపు (మార్చి 19న) కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది. మరో ఏడాదిలో దశలవారీగా మొత్తం 10,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఏటా ఉగాది నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాబ్ నోటిఫికేషన్ పోస్టుల వివరాలు..! తాజా సమాచారం ప్రకారం.. 3004 పోస్టులతో Dsc నోటిఫికేషన్ విడుదల కానుంది. కీలక పోస్టుల వివరాలు: సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT): అత్యధికంగా ఎస్‌జీటీ (తెలుగు) విభాగంలో 1,744 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ (181), కన్నడ భాష (29) పోస్టులు కూడా భర్తీ కానున్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పనిచేసే స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో 361 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో 352 పోస్టులు ఉన్నాయి. ఆర్ట్స్, ఇతర పోస్టులు: మ్యూజిక్ టీచర్ (9), క్రాఫ్ట్ (49), ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్ (4), డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ (4), డ్రాయింగ్ టీచర్ (20) పోస్టులను భర్తీ చేయనున్నారు. మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్, వివిధ భాషా (తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ) విభాగాల్లో స్కూల్ అసిస్టెంట్లు (School Assistants) ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ క్యాలెండర్‌లో ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విభాగాల్లో 3,000 కు పైగా పోస్టులు, పోలీస్ శాఖలో 3,000 ఎస్సై (SI), కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు విశ్వవిద్యాలయాల్లో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఏఈ (AE) విభాగంలో 500 పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్షేమ హాస్టల్ వార్డెన్లు, అటవీ శాఖ, స్టాటిస్టిక్స్ అధికారులు, గ్రూప్-1 పోస్టులను కూడా ఈ క్యాలెండర్‌లో చేర్చారు. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా, సరైన నిబంధనలతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సుదీర్ఘ కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఉగాది ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహం నెలకొంది.
Regional Description: 