News Friday, March 27, 2026 - 09:57
Submitted by andhra on Fri, 2026-03-27 09:57
Select District:
News Items:
Description:
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
Andhra Pradesh Job Calendar 2026: ఏపీలో ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుల చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. మరో హామీ నిలబెట్టుకున్నామని నిరుద్యోగులు బాగా చదివి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు
ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదివేల ఆరు ఉద్యోగాలతో తొలి క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. "ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది."
ఏ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తామో సవివరంగా ఇందులో ఉంటుందని లోకేష్ వెల్లడించారు. " వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాం.
నిరుద్యోగులు నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లోకేష్ సూచించారు. ప్రజా ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుందని ఇక నిరుద్యోగులు బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. " ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.."
Regional Description: