News Friday, March 27, 2026 - 09:52

Select District: 
News Items: 
Description: 
AP DSC 2026: ఉపాధ్యాయ నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 3600 పోస్టులతో ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్! AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఏడాది నుంచి ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. ఉపాధ్యాయ నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 3600 పోస్టులతో ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్! AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామంటూ గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈ ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తారు. గతేడాది డీఎస్సీ ద్వారా 16వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇప్పుడు మిగిలిన వాటిని భర్తీ కోసం కసరత్తు చేస్తున్నారు. ఎన్ని పోస్టులు ఉండొచ్చు? పూర్తి లెక్కలేంటి? ప్రభుత్వం సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ డీఎస్సీలో దాదాపు 3600 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖ అధికారులు సేకరించిన ఖాళీల వివరాలను పరిశీలిస్తే, వివిధ విభాగాల్లో పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో 1700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌, సంక్షేమ పాఠశాలల్లో 1200 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దాదాపు 700 వరకు స్పషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. Show Quick Read Key points generated by AI, verified by newsroom గతేడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం 16, 347 ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన ఇచ్చింది. ఇందులో 15, 941 ఉద్యోగాలు భర్తీ చేశారు. వివిధ కారణాలతో మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారు. వాటిని కూడా ఈసారి నోటిఫికేషన్‌లో చేర్చనున్నారు. సిలబస్‌, పరీక్ష విధానం పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఒక మంచి విషయం ఏంటంటే ఈసారి సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది డీఎస్సీకి అనుసరించిన సిలబస్‌, మార్గదర్శకాలనే ఈసారి కూడా వర్తింపజేయనున్నారు. ప్రత్యేక డీఎస్సీకి సంబంధించిన డీఎస్సీకి సంబంధించిన సిలబస్‌ ను ప్రభుత్వం ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులకు ఇంగ్లీష్ ప్రొఫిసియెన్సీ, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట అనుకున్నా ప్రస్తుతానికి సమయం తక్కువ ఉండటంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వెయిటేజీ రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ మీద పని చేస్తున్న టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, పదేళ్ల సర్వీస్ ఉండి, టెట్ వంటి అర్హతలు సాధించిన విద్యార్థులకు మినిమం టైమ్‌స్కేలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంతా డీఎస్సీ రాసినప్పుడు వారికి వెయిటేజీ ఇచ్చే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 2500మందిపైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఏటా డీఎస్సీ క్యాలెండర్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే అభ్యర్థులు కూడా చదువులతో కుస్తీ మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Regional Description: 