News Wednesday, December 17, 2025 - 09:34
Submitted by andhra on Wed, 2025-12-17 09:34
Select District:
News Items:
Description:
Amazon: ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
Amazon: ప్రపంచం అంతా లేఆఫ్‌లు నడుస్తున్నాయి. అమెజాన్ కూడా అంతే. కానీ ఇండియాలో ఐదేళ్లలో పది లక్షల మందికి ఉద్యోగాలిస్తామని ఆ సంస్థ ప్రకటించేసింది.
ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
Amazon plans 10 lakh new India jobs by 2030: అమెజాన్ కంపెనీ భారత్‌లో అతి పెద్ద ప్రణాళిక ప్రకటించింది. 2030 నాటికి దేశంలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నామని అమెజాన్ తెలిపింది. ఇందు కోసం భారత్ లో 35 బిలియన్ డాలర్లు అంటే సుమారు 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని కూడా ప్రకటించారు. ఇది 2025 నుంచి 2030 వరకు 5 సంవత్సరాల్లో జరగనున్న పెద్ద విస్తరణ ప్లాన్. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత భారత్‌పై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా ఉంది.
అమెజాన్ బ్లాగ్ పోస్ట్‌లో ఈ ప్రకటన చేశారు. భారత్‌లో మా వ్యాపార విస్తరణ, డెలివరీ నెట్వర్క్ పెరగడంతో 2030 నాటికి మొత్తం 38 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఇందులో 10 లక్షలు కొత్తగా డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్, సీజనల్ ఉద్యోగాలు అని చెప్పారు. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఎగుమతులు, డిజిటల్ ఎకానమీపై దృష్టి పెట్టి ఈ పెట్టుబడి చేస్తామని తెలిపారు.
అమెజాన్ భారత్‌లో తన అన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతుంది. AI డిజిటల్, కొత్త టెక్నాలజీలు, క్లౌడ్ సర్వీసులు (AWS) విస్తరణ, భారత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లడం, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్ ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్, డెలివరీ సెంటర్లు పెంచడం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంది. ఇది భారత్ డిజిటల్ ఎకానమీని బలోపేతం చేస్తుందని అమెజాన్ CEO చెబుతున్నారు.
మరో వైపు ప్రపంచవ్యాప్తంగా 14,000 ఉద్యోగాలు తొలగించింది. భారత్‌లో 1,000ని తొలగించింది. అమెజాన్ ఆక్టోబర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. ఇది మూడేళ్లలో అతిపెద్ద లేఅఫ్. AI ఆధారిత రీస్ట్రక్చరింగ్ కారణంగా జరిగింది. భారత్‌లో కూడా 1,000 మంది ఫైనాన్స్, HR, మార్కెటింగ్, టెక్ విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. మరో 30,000 మంది తొలగింపు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అమెజాన్ కంపెనీ భారీ లాభాలను చూస్తోంది. ఏఐపై పెట్టుబడుల కోసం రీ స్ట్రక్చరింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. భారత్‌లో కొత్త ఉద్యోగాలు సృష్టించడం ద్వారా ఈ లాస్‌లను బ్యాలెన్స్ చేస్తామని అమెజాన్ చెబుతోంది. AIతో కొత్త రోల్స్ వస్తాయి. పాత జాబ్స్ తొలగితే కొత్తవి ఎక్కువ అని చెబుతున్నారు.
అమెజాన్ భారత్‌లో 2020 నుంచి $18 బిలియన్లు పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం 1.5 మిలియన్ ఉద్యోగాలు సపోర్ట్ చేస్తోంది. ఈ కొత్త ప్లాన్‌తో మొత్తం 38 లక్షలకు చేరుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కొత్త సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రకటన టెక్ ఇండస్ట్రీలో సానుకూల సంకేతంగా చూస్తున్నారు. భారత్ డిజిటల్ గ్రోత్‌కు అమెజాన్ పెద్ద భాగస్వామి అవుతుందని నిపుణులు అంచనా.
Regional Description: