News Wednesday, May 11, 2022 - 16:12
Submitted by andhra on Wed, 2022-05-11 16:12
Select District:
News Items:
Description:
11/5/2022: దిశను మార్చుకున్న అసని తుపాను.. కొనసాగుతున్న రెడ్ అలర్ట్....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసాని తుపాను కొనసాగుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ఇది దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య కదులుతుందని చెప్పారు. ప్రస్తుతం గంట 6 కి.మీ వేగంతో పయనిస్తుందని.. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఉదయం వరకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరంలో గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., నర్సాపూర్‌కు 50 కిలోమీటర్ల కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖకు 280 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తీరం మీదుగా ప్రయాణం చేస్తుందని.. మరికొద్ది గంటల్లో సముద్రంలోకి ప్రవేశించి క్రమేపి బలహీన పడుతుందని చెప్పారు. తీర లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేటి వరకు రెడ్ అలెర్ట్ మెసేజ్ కొనసాగుతుందన్నారు. సహాయక చర్యలు చేపట్టాం...తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. మానవత్వంతో సహాయం చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. కోస్తా జిల్లాల్లో తుపాన్ ప్రభావంపై కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశామన్నవారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తుపాన్ వలన కురిసే భారీ వర్షాలతో ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉన్నామన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అదేశించామని.. పునరావాస కేంద్రాలలోని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
Regional Description: