News Saturday, April 23, 2022 - 12:41

Select District: 
News Items: 
Description: 
రాబోవు నాలుగు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ...... బోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. డీహైడ్రేట్‌ కాకుండా ఓఆర్‌ఎస్‌ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీనిమ్మకాయనీరుమజ్జిగకొబ్బరినీరు తాగాలని సూచించారు. వృద్ధులుగర్భిణీలుబాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. అనేక చోట్ల 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వేసవి తీవ్రత, ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.* * * విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 24న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45నుంచి 46 డిగ్రీలు, అల్లూరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. * * * 25న అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో 45నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 26న కూడా 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Regional Description: 