News Thursday, April 14, 2022 - 13:28

Select District: 
News Items: 
Description: 
ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం..... ఈనెల 15 నుంచి జూన్‌ 14వ తేదీ రాత్రి వరకు సముద్రంలో మర పడవలతో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించిందని మత్స్యశాఖ జెడి శ్రీనివాసరావుగారు ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులందరూ ప్రభుత్వ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఉత్తర్వులను ధిక్కరించి మర పడవలతో చేపల వేట సాగిస్తే రూ.2,500 వరకు జరిమానా విధించి, పట్టిన చేపలతో పాటు పడవ, వలలు స్వాధీనం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. నిషేధ సమయంలో చేపల వేటకు వెళ్లిన వారికి చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం నిలిపివేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పడవలకు కలర్‌ కోడ్‌ పాటించాలని స్పష్టం చేశారు. బోటు రిజిస్ట్రేషన్‌ నంబరును బోటుపై స్పష్టంగా కనిపించేలా ఉండాలని తెలిపారు. లేకుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి లభించదని పేర్కొన్నారు. మర పడవల యజమానులందరూ వేట నిషేధాన్ని తప్పక పాటించి మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు మత్స్యకార భరోసా కింద ఇంజిన్‌ బోటుకు యజమానితో సహా ఆరుగురు, తెర చాపలపై నడుపు చిన్న తెప్పకు ముగ్గురు మత్స్యకారులకు రూ.పది వేలు చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 18 నుంచి 60 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. రేషన్‌కార్డు ప్రాతిపదికగా కుటుంబానికి ఒక్కరికి మాత్రమే మంజూరు చేస్తారని స్పష్టం చేశారు.
Regional Description: 