News Friday, March 25, 2022 - 10:55

Select District: 
News Items: 
Description: 
Lucky Fish: ఈ చేప చిక్కతే అదృష్టమే? ఎంత ధర పలికిందో తెలుసా..? ప్రత్యేకతలేంటి..?..... Lucky Fish: మత్స్యాకారులు నిత్యం వేటకు వెళ్తుంటారు.. అయినా రోజూ విధితో పోరాటం చేస్తారు.. ఒక్కోసారి వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా దక్కదు.. కానీ ఒఖ్క చేప మాత్రం వలకు చిక్కితే.. వారి పంట పడినట్టే.. దాని పేరే గోల్డెన్ ఫిష్ (Golden Fish).. దీన్ని కచ్చిడి చేప (Kachidi Fish) అని కూడా అంటారు. ఈ మధ్య ఈ కచ్చడి చేప పేరు జనాల నోళ్లలో బాగా నానుతుంది. అందుకు కారణం దాని ధర.. రుచి.. ఈ రకం చేప జాలర్లకు చిక్కాలి అంటే వారికి సుడి ఉండాలి అంటారు. లక్కీగా ఆ కచ్చిడి వలలో పడితే.. ఒక్కరోజులోనే లక్షాధికారి అయిపోవచ్చు. ముఖ్యంగా అందులోనూ మగ చేప అయితేనే మార్కెట్‌లో పీక్స్‌లో డిమాండ్ ఉంటుంది. దీన్ని కొనేందకు వ్యాపారులు విపరీతంగా పోటీ పడతారు. అంత డిమాండ్ ఎందుకు అంటారా.. కేవలం రుచి కోసం అయితే అంత ధర ఏంటి అనుమానం కలగొచ్చు.. ఈ కచ్చిడీ కేవలం రుచికే కాదు.. ఔషధంగా కూడా పని చేస్తుంది అంటున్నారు మత్స్య కారులు. కచ్చిడి చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని.. అందుకే అంత రేటని వ్యాపారాలు చెబుతారు. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఖరీదైన వైన్‌ తయారీలోనూ ఈ ఫిష్‌‌ను వినియోగిస్తారు. అందుకే ఇంత డిమాండ్ ఆ చేపకు. అందుకే దీన్ని గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు గోల్డ్ దొరికనట్టే అని భావిస్తారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద ఇరవై ఎనిమిది కేజీల మగ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేపను పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లోని నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారి 2 లక్షల 90 వేల రూపాయలకు కొనుగోలు చేశారు.
Regional Description: 