News Monday, February 28, 2022 - 11:43
Submitted by andhra on Mon, 2022-02-28 11:43
Select District:
News Items:
Description:
ఇంటర్ విద్యార్హతతో 5 వేల ప్రభుత్వ ఉద్యోగాలు......నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏటా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో ఈ సంస్థకు జోనల్ ఆఫీసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, గువాహటి, అల్‌హాబాద్, ముంబైలో ఎస్ఎస్‌సీ కార్యాలయాలు ఉన్నాయి. చండీగఢ్, రాయ్‌పుర్‌లో సబ్ జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్లస్ 2 లెవల్ పరీక్షకు ఎస్ఎస్సీ ప్రకటన జారీ చేసింది. 2022 మార్చి 7 వరకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎస్‌సీ వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనతో 5 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. మే నెలలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు.
Regional Description: