News Monday, February 21, 2022 - 11:48

Select District: 
News Items: 
Description: 
ఇక ఏపీ లో 'ఫిష్ ఆంధ్ర' పేరుతో చేపలు రొయ్యల అమ్మకాలు ...... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చేపలు, రొయ్యలను కూడా మొబైల్ వాహనాల ద్వారా ఫిష్ ఆంధ్ర పేరుతో ఇంటివద్దకే తెచ్చేందుకు సిద్దమైంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70 ఫిష్ హబ్‌లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఒక్కో హబ్‌కు మత్య్స ఉత్పత్తుల యూనిట్లతో పాటు 14 వేల రిటైల్ అవుట్ లెట్లు, రిటైల్ వెండింగ్ పుడ్ కోర్టులు, మొబైల్ యూనిట్లు ఉండనున్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 56 హబ్‌లు సిద్దం చేసింది. వీటికి అనుబంధంగా దుకాణాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదే క్రమంలో ఈ కామర్స్ యాప్ ద్వారా కూడా మత్య్స ఉత్పత్తులు అమ్మకాలు చేపట్టాలని భావిస్తోంది. మొబైల్ వాహనాలు ద్వారా లైవ్ ఫిష్, రొయ్య అమ్మకాలకు కోసం లబ్దిదారుల ఎంపిక కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం తలపెట్టిన ఫిష్ ఆంధ్ర వలన వినియోగదారులతో పాటు రైతులకు లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే చేపలు, రోయ్యలు దేశ, విదేశాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎగుమతులను నాణ్యత పేరుతో లేదా ఇతర తనిఖీల పేరుతో అక్కడ తిరస్కరించడంతో రైతులు నష్టపోతున్నారు. దీంతో ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళ్తుంది. ఇంటింటికి రేషన్, ఇతర ఈ కామర్స్ వస్తువులు లాగా త్వరలో చేపలు, రొయ్యలు కూడా అందుబాటులోకి రానున్నాయి. చేపలు, రోయ్యలను కూడా ప్రాసెసింగ్ చేసి మరీ అమ్మకాలు చేపట్టడంతో ప్రభుత్వం చేపట్టనున్న ఫిష్ ఆంధ్రకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
Regional Description: 