News Thursday, February 3, 2022 - 15:56

News Items: 
Description: 
చేపలు తింటే కాన్సర్ రాదా... శరీరం బలంగా కావాలంటే తగినంత పోషక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ గత రెండేళ్లుగా మహమ్మారి పుణ్యమా అని ప్రజలు అనుక్షణం భయంతో బతుకుతున్నారు. పరిపూర్ణ ఆరోగ్యవంతులపై మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపదని ఎన్నో అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. శరీరానికి రోగనిరోధక శక్తితో పాటు మెదడు అభివృద్ధి, కండరాల బలం, ఎముకల ఆరోగ్యం చాలా అవసరం. అయితే ఇవన్నీ పోషకాలు ఉండే ఆహారం తినడం ద్వారానే లభిస్తాయి. ఈ పోషకాల మూలాలను సరైన ట్రాక్‌లో ఉంచడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 1) కాల్షియం : 99 శాతం శరీరానికి కావాల్సిన కాల్షియం ఎముకలు, దంతాలలోనే ఉంటుంది. కాల్షియం అనేది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా కీలకం. కాల్షియం కండరాల సంకోచంలో సహాయపడుతుంది, రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది మరియు మన మెదడు మరియు నరాలు ఒకదానితో ఒకటి సంభాషించడానికినూ సహాయపడుతుంది. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు కాల్షియం అధికంగా ఉండే ఆహార వనరులు. దీంతో పాటు ఆకుకూరలు, బీన్స్ వంటి ఇతర ఆహారాలు కాల్షియంను మంచి స్థాయిలో అందజేస్తాయి.2) ప్రొటీన్ : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన పోషకాలలో ప్రొటీన్ కూడా ఒకటి. కండరాలు, ఎముకలు, హార్మోన్లు వంటి శరీరంలోని ప్రతి కణానికి ప్రొటీన్ బలాన్ని చేకూరుస్తుంది. శరీర బరువును బట్టి రోజుకు 800 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుంది. అధిక నాణ్యత గల ప్రొటీన్ ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని కండరాలు గట్టిగా ఉంటాయి. కోడిగుడ్డులో అధిక ప్రొటీన్ లభిస్తుంది. అందుకే వైద్యులు రోజుకు ఒక గుడ్డు అయినా తినమని సలహా ఇస్తుంటారు. కోడిగుడ్డు తినని వారు పప్పుధాన్యాలను ఎక్కువ తీసుకుంటే అధిక నాణ్యత గల ప్రొటీన్ లభిస్తుంది. ఇంకా చీజ్, క్వినోవా, వేరుశెనగ, బాదం వంటి ఆహారాలు కూడా ప్రోటీన్ లభించేందుకు ఎంతో సహాయపడతాయి. పాల ఉత్పత్తులు కూడా ప్రొటీన్ లభించడానికి సరైన ఎంపికలు. 3) విటమిన్ ఎ : యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అని పిలువబడే ఈ పోషకం చర్మం, నోరు, కడుపు, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అవి ఇన్ఫెక్షన్‌తో మెరుగ్గా పోరాడగలవు. విటమిన్ ఎ అనేది పదునైన దృష్టికి కూడా కీలకం. విటమిన్-ఎ తీసుకుంటే కంటికి చాలా మంచిది. ఈ విటమిన్ లోపిస్తే కంటిసమస్యలు రావడమే కాకుండా చూపు మందగిస్తుంది. తక్కువ కాంతి ఉన్నా చూడలేకపోతుంటారు. కళ్లు చురుకుగా ఉండాలంటే విటమిన్ ఎను తీసుకోవాల్సిందే. క్యారెట్, తోటకూర, ములగాకు, చిలగడదుంప, గుమ్మడికాయ, బచ్చలికూరలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. 4) ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రధానంగా సీఫుడ్‌లో లభిస్తాయి. ఇవి మన మెదడుకు పోషణ అందిస్తాయి. అంతేకాకుండా కంటి చూపును పదునుగా ఉంచుతాయి. చేపలు ఒమెగా 3 లభించే అద్భుతమైన ఆహారం. మీరు ఎక్కువగా కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలను తినడం ద్వారా శరీరానికి తగిన మొత్తంలో ఒమెగా-3ని పొందవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గొంతు కాన్సర్‌, నోటి కాన్సర్‌ ఇతర రకాల కాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 5) సెలీనియం : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన పోషకాలలో సెలీనియం కూడా ఒకటి. శరీరంలో తగినంత సెలీనియం లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. దీని వల్ల కీళ్ల నొప్పుల సమస్య మొదలవుతుంది. థైరాయిడ్ పనితీరుకు కూడా సెలీనియం చాలా ముఖ్యమైనది. ఒక కప్పు పాలు లేదా పెరుగులో 8 ఎంసీజీ సెలీనియం లభిస్తుంది. శరీరానికి తగినంత సెలీనియం కావాలంటే మీరు సోయా పాలు, చికెన్, చేపలు, గుడ్డు, అరటిపండ్లు, జీడిపప్పులు, బచ్చలికూర, బ్లూబెర్రీలను ఆహారంలో చేర్చుకోవచ్చు. 6) కోలిన్: మన మెదడు, నాడీ వ్యవస్థ జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రణ అనేవి కోలిన్‌పై ఆధారపడి ఉంటాయి. కానీ మనలో చాలామంది దీనిని తగినంతగా తీసుకోరు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు పుట్టబోయే పిల్లల అభివృద్ధి కోసం వారికి అదనపు కోలిన్ అవసరం. కోలిన్ యొక్క ప్రధాన ఆహార వనరులు మాంసం, పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు. ముఖ్యంగా జంతువుల నుంచి లభించే ఆహారంలో కోలిన్ అధికంగా లభిస్తుంది.
Regional Description: 