News Thursday, December 30, 2021 - 13:47
Submitted by andhra on Thu, 2021-12-30 13:47
Select District:
News Items:
Description:
15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సిన్.. మార్గదర్శకాలు జారీ . . . .
15-18 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషనుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2022 జనవరి 3 తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సీన్ వేయనున్న ప్రభుత్వం… కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ వయస్సున్న వారందరికీ ప్రస్తుతం కోవాక్సిన్ టీకాను మాత్రమే వేస్తున్నట్టు ప్రకటించింది వైద్యారోగ్యశాఖ. 2007 కంటే ముందు పుట్టిన వారంతా ఈ వ్యాక్సీన్ డోసుకు అర్హులని కోవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించిన ప్రభుత్వం… వ్యాక్సీన్ వేసే వైద్యారోగ్య కేంద్రాల్లోనూ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు 2022 జనవరి 10 తేదీ నుంచి మరో డోసు ఇవ్వనున్న ప్రభుత్వం.. రెండో డోసు తీసుకుని 9 నెలలు దాటితేనే బూస్టర్ డోసు వేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. 2 టీకా డోసులు తీసుకున్న 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులకూ ఇదే తరహాలో మరో డోసు వ్యాక్సీన్ టీకాను జనవరి 10 తేదీ నుంచి అందించనున్నట్టు వెల్లడించింది. టీకా రెండో డోసు తీసుకుని 39 వారాలూ లేదా 9 నెలలు దాటితేనే ఈ వ్యాక్సీన్ బూస్టర్ టీకా వేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసిన ప్రభుత్వం… ఈ మార్గదర్శకాలన్నీ 2022 జనవరి 3 తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ సర్కులర్ జారీ చేసింది.
Regional Description: