News Sunday, December 26, 2021 - 17:33

Select District: 
News Items: 
Description: 
26/12/2021: చరిత్రలో ఈరోజు: 13 దేశాలను వణికించిన సునామీకి 17 ఏండ్లు ...... హిందూ మహాసముద్రంలో భయంకరమైన అలలు మొదలై పలు దేశాల్లో కల్లోలం సృష్టించి సరిగ్గా నేటికి 17 ఏండ్లు గడిచాయి. 2004 లో సరిగ్గా ఇదే రోజున క్రిస్మస్‌ పండుగను సంతోషంగా జరుపుకుని మంచి నిద్రలోకి జారుకున్న సమయంలో.. ఒక్కసారిగా సముద్రం ఒళ్లు విరుచుకుంది. తన అలల ప్రతాపాన్ని ప్రదర్శించింది. 13 దేశాల్లోని దాదాపు 2.30 లక్షల మందిని బలితీసుకున్నది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 1.28 లక్షల మంది చనిపోయారు. సముద్రుడి అలల ధాటికి బంగళాలు, కార్లు, పడవలు.. ఇలా ఒక్కటేమిటి అడ్డొచ్చిన ఎన్నో సర్వనాశనమయ్యాయి. ఇండోనేషియా, శ్రీలంకలో దాదాపు 18 లక్షల మంది ఇండ్లను కోల్పోగా, 50 వేల మంది గల్లంతయ్యారు. 2004 లో డిసెంబర్‌ 26 అత్యంత విచారకరమైన రోజుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజును ఎప్పుడు గుర్తుకుచేసుకున్నా ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం. హిందూ మహాసముద్రంలో 9.15 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత సునామీ మొదలైంది. ఈ సునామీ కారణంగా సముద్రంలో దాదాపు 100 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ తరంగాలు భారతదేశంతోపాటు ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, మడగాస్కర్, మాల్దీవులు, మలేషియా, సీషెల్స్, సోమాలియా, టాంజానియా, కెన్యా దేశాల్లో భారీ విధ్వంసం సృష్టించాయి. భారతదేశంలో 12 వేల మందికి పైగా మరణించగా.. దాదాపు 3 వేల మంది గల్లంతయ్యారు. మన దేశం దాదాపు రూ.12 వేల కోట్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. తమిళనాడులో అత్యధికంగా 8 వేల మంది మరణించారు. అండమాన్ నికోబార్‌లో 3 వేల మందికి పైగా, పుదుచ్చేరిలో 599, కేరళలో 177, ఆంధ్రప్రదేశ్‌లో 107 మంది మరణించారు.
Regional Description: 