News Wednesday, November 24, 2021 - 10:16
Submitted by andhra on Wed, 2021-11-24 10:16
Select District:
News Items:
Description:
24/11/2021: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 27వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, ఈ నెల 27వ తేదీ వైఎస్సార్ కడప జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా పేర్కొంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు.
Regional Description: