News Friday, November 12, 2021 - 11:27
Submitted by andhra on Fri, 2021-11-12 11:12
Select District:
News Items:
Description:
ఏపీకి మరో గండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో పంటలు కూడా నీటమునిగిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి నగరాలు పూర్తిగా నీటమునిగాయి. అలాగే చిత్తూరు, నెల్లూరులోని తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు తుఫాన్ ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్ లో బంగాళాఖాతంలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. తాజాగా కొన్నిరోజుల వ్యవధిలోనే 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అవి తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి
Regional Description: