News Friday, October 29, 2021 - 13:37

News Items: 
Description: 
ప్రస్తుతం ఉన్న కోవిడ్ మార్గదర్శకాలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలలో నిబంధనలు అమలయ్యేలా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా స్థానిక, జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కోరారు. కోవిడ్ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని స్పష్టం చేసారు. దేశంలో కోవిడ్ పాజిటివిటీ కేసుల క్రమంగా పెరుగుతున్నందున ప్రోటోకాల్ విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న రోజులలో దీపావళి సహా పండుగలు ఉన్నాయి. దేంతో పండగ వేళల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని కరోనా నియమాలను పాటించాలని, ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా మూడో వేవ్ కు స్వాగతం పలికినావాళ్ళమవుతామని హెచ్చరించింది.
Regional Description: 