News Tuesday, October 26, 2021 - 19:51

Select District: 
News Items: 
Description: 
26/10/2021: ఏపీకి రెయిన్ అలెర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలు : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఏర్పడిందని తెలిపింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఒక అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతోపాటు ఉపరితల ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడినట్లు తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 km ఎత్తు వరకు విస్తరించినట్లు వెల్లడించింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచనలు చేసింది.
Regional Description: 