News Saturday, October 9, 2021 - 20:43

Select District: 
News Items: 
Description: 
9/10/2021 : ఏపీకి బిగ్ అలర్ట్: 3 రోజులు భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2- 3 రోజుల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ దిశలో ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 5.8 సెంటీ మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల అదే ప్రాంతంలో రాబోయే 48 గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 4- 5 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ- వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఏపీలో పరిస్థితులు.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం శని, ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర శనివారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది .
Regional Description: 