News Wednesday, September 29, 2021 - 09:33
Submitted by andhra on Wed, 2021-09-29 09:33
Select District:
News Items:
Description:
29/9/2021: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 28వ తేదీన మరో అల్పపీడం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా తీరానికి చేరనుంది. రానున్న 24 గంటలలో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గులాబ్ తుఫాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి విదర్భలోకి ప్రవేశించింది. ఇది మరింత బలహీనపడి ఈశాన్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించి 24 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం బలపడి తుఫానుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఖతార్ సూచించిన షహీన్ అని పేరు పెట్టే అవకాశం ఉందని తెలిపారు.
Regional Description: