News Saturday, July 24, 2021 - 10:01

Select District: 
News Items: 
Description: 
టెన్త్‌ క్లాస్‌తో 25,271 పోలీస్‌ జాబ్స్‌.. అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభం ప్రధానాంశాలు: • ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ 2021 నోటిఫికేషన్‌ • మొత్తం 25, 271 పోస్టుల భర్తీ • 10వ తరగతి పాసైన వాళ్లు అర్హులు • జులై 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం • ఆగస్టు 31 దరఖాస్తులకు చివరితేది అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 25, 271 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 22,424 పోస్టులు.. మహిళలకు 2847 పోస్టులున్నాయి. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌ఎసీ‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. ముఖ్య సమాచారం: • అర్హత: 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. • వయసు: అభ్యర్థుల వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. • దరఖాస్తు ఫీజు: పురుషులకు రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. • వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Online Written Examination), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination)ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఇక ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.
Regional Description: 