News Wednesday, June 30, 2021 - 18:32

News Items: 
Description: 
జూలై 1 నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1 నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారు. కరోనా పాజిటివిటి రేటు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. ఈ ఆంక్షలు జూలై 7వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి.
Regional Description: 