News Saturday, June 5, 2021 - 16:28
Submitted by andhra on Sat, 2021-06-05 16:28
Select District:
News Items:
Description:
చేపలు పాడగుట – కారణాలు
మిగతా ఆహారములతో పోల్చినపుడు చేపలు అతి త్వరగా పాడయ్యే లక్షణం కలవి. దీనికి ప్రధాన కారణం చేపలలో ఉండే నీరు. ముఖ్యంగా మన ప్రాంతాలలో ఉష్ణోగ్రత అధికముగా ఉండటం, చేపలలో ఉండేటటువంటి నీటి వలన బాక్టీరియా చేప శరీరంలో త్వరితంగా వృద్ధి చెంది పాడై త్వరగా నాణ్యత చెడిపోవుటకు కారణమవుతాయి. ఎందువల్లనంటే చేపకు గల సహజముంగా ఉండేటటువంటి రక్షణ వ్యవస్థ వలన చేప బతికున్నపుడు పైన తెలపినవి జరగవు. కానీ చేప మరణించగానే దానియొక్క రక్షిణ వ్యవస్థ పనిచేయక పోవడం వలన వేగంగా బాక్టీరియా వ్రుద్ది చెంది చేప త్వరగా పాడై నాణ్యతలో మార్పులు చోటు చేసుకుంటాయి.
చేప చనిపోయిన తరువాత పూర్తిగా చెడిపోయేవరకూ కొన్ని మార్పలు చెందుతాయి. వీటిని మరణానంతర మార్పులు అంటారు. చేప చనిపోయిన వెంటనే మదువుగా, మెత్తగా ఉంటుంది. తదుపరి 3 మరియు 4 గంటలలో చేప ద్రుడంగా బిగుసుకుపోతుంది. ఈ దశ వరకూ చేప నాణ్యత బాగానే ఉంటుంది. తదుపరి దశలో చేప నెమ్మదిగా పాడవడం జరుగుతుంది. సుమారు 6 గంటల తరువాత చేప తిరిగి మెత్తగా మారి పాడవడం మొదలవుతుంది. చేప శంకులు ఎర్రదనం నుండి గోధుమ రంగుగా పాలిపోతాయి. మరణానంతర మార్పుల వలన చేపలలో వచ్చే మార్పులను బట్టి గ్రేడులుగా విభజిస్తారు. గ్రేడులను బట్టి ధర కూడా ఆధారపడి ఉంటుంది. వీటిలో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 లు తినడానికి ఉపయోగడపతాయి. గ్రేడ్ 3 రకం చేపలు ఆహారంగా ఉపయోగపడచ్చు లేదా ఉపయోగపడకపోవచ్చు. కానీ గ్రేడ్ 4 చేపలు తినడానికి పనికిరాకుండా పూర్తిగా పాడై ఉంటాయి.
గ్రేడ్ 1 లో చేప మెరుస్తూ ఉంటుంది మరియు సముద్రపు నాచు వాసన వస్తుంది. గ్రేడ్ 2 లో మెరుపు కొంచెం తగ్గి పళ్ళు వాసన ఉంటుంది. గ్రేడ్ 3 లో చూడడానికి కొంచెం డల్ గా ఉండి అదొక రకమైన వాసన వస్తుంది. మరియు గ్రేడ్ 4 లో పొలుసులు ఊడిపోయి ముడతలు పడి ఉంటుంది మరియు కుళ్ళిపోయిన వాసన వస్తుంది.
చేపలు మొదటి 6 రోజులు గ్రేడ్ 1 దశలో, 6 నుంచి 10 రోజుల వరకూ గ్రేడ్ 2లో, 10 నుంచి 14 రోజుల వరకు గ్రేడ్ 3 లోనూ ఉండి 14 రోజుల తరువాత గ్రేడ్ 4 దశలోకి చేరి పూర్తిగా పాడైపోతాయి.
Regional Description: