News Saturday, April 17, 2021 - 10:41
Submitted by andhra on Sat, 2021-04-17 10:41
Select District:
News Items:
Description:
కరోనాను గుర్తు పట్టండిలా..జాగ్రత్తలివే
కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. దేశంలో ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రాణాలు కూడా వేలల్లో గాల్లో కలిసిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఐతే కరోనా కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కూడా వస్తుండడంతో ప్రజలకు కరోనా లక్షణాలేవో,సీజనల్ గా వచ్చే జ్వర లక్షణాలేవో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సీజనల్ లక్షణాలే కరోనా లక్షణాలుగా మారాయి.
ప్రజలు జాగ్రత్త తీసుకోకుంటే మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. కరోనా ప్రారంభ దశలో అన్ని జాగ్రత్తలు పాటించిన ప్రజలు ప్రస్తుతం మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు,నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీజనల్ జ్వర లక్షణాలేవో, కరోనా లక్షణాలేవో తెలుసుకుందాం.
కరోనా లక్షణాలు: తీవ్రజ్వరం,మూడు రోజులైనా తగ్గదు. జలుబు ఉంటుంది కానీ ముక్కు కారదు. పొడి దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలియదు. ఒళ్లంతా నొప్పులు తీవ్రంగా ఉంటాయి. విపరీతమైన తలనొప్పి ఉంటుంది. గొంతు నొప్పి,ఛాతి నొప్పి ఉంటుంది. కండ్లు ఎర్రబడుతాయి. వాంతులు,విరేచనాలు కూడా అవుతుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు పాటించి చికిత్స తీసుకోవాలి. కరోనా పరీక్షలు చేయించుకొని మెరుగైన చికిత్స పొందాలి.
సీజనల్ జ్వర లక్షణాలు: సాధారణమైన జ్వరం ఉంటుంది. మూడు రోజుల్లోనే తగ్గుతుంది. ముక్కు కారుతుతంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది. రుచి,వాసన తెలుస్తుంది. ఒళ్లునొప్పి,తలనొప్పి మామూలుగా ఉంటుంది. గొంతు నొప్పి ఉంటుంది. ఛాతిలో నొప్పి ఉండదు. కండ్లు ఎర్రబడవు. వాంతులు,విరేచనాలు ఉంటాయి. కరోనా లక్షణాలకు,సీజనల్ లక్షణాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. కావున నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్త చర్యలు: * తప్పనిసరిగా మాస్కును ధరించాలి.* ప్రతి అరగంటకు ఒక సారి శానిటైజ్ చేసుకొని చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కరచాలనం చేయరాదు. * ప్రతి వ్యక్తి ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనిషికి మనిషికి ఆరు అడుగుల దూరం ఉండాలి. * దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. *సాధ్యమైనంత వరకు చల్లగా ఉండే పదార్దాలకు దూరంగా ఉండాలి. వేడి నీళ్లు తాగాలి. వేడి వస్తువులు తినాలి. ఎండాకాలమైనా సరే వేడి వస్తువులనే తీసుకోవాలి. * ఉదయం వేళ ఎండలో 2 గంటలపాటు ఉంటే మంచిది. ఏసీలలో ఉండరాదు. * టైంకి తప్పకుండా ఆహారం తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఉండకూడదు. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఇమ్యూనిటి పవర్ పెరుగుతుంది.
ప్రతి రోజు తప్పకుండా 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. నారింజ పండ్లను ఎక్కువ తీసుకోవాలి. రలల్లో శొంఠి అల్లం ఒక స్పూన్ వేసుకోవాలి. బయటి ఫుడ్ కు దూరంగా ఉండాలి. దానిమ్మ,అల్లనేరడి పండ్లను తీసుకోవాలి. పసుపు వేసుకొని పాలను తాగాలి. గుడ్లు,మాంసాహారాలను బాగా ఉడకబెట్టి తినాలి. విందులు,వినోదాలకు దూరంగా ఉండాలి. గుంపులు గుంపులుగా సమూహాలుగా ఉండరాదు.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు కూడా సాధ్యమైనంత దూరం ఉండి స్వంత వాహానాల్లో వెళ్లేలా చూసుకోవాలి. 10 సంవత్సరాలలోపు చిన్నారులు,గర్భిణీలు,బాలింతలు,వృద్దులు బయటికి వెళ్లవద్దు. అత్యవసర సమయాల్లో జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలి.
కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆలస్యం చేయరాదు.
Regional Description: