News Thursday, April 15, 2021 - 17:29
Submitted by andhra on Thu, 2021-04-15 17:29
Select District:
News Items:
Description:
Fishing Ban చేపలవేట నిషేధం : బంగాళాఖాతంలోని సముద్ర జలాల్లో చేపలవేట చేయడాన్ని ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 15 వరకు అనగా 61 రోజులుపాటు మోటారు, మెకనైజుడ బోట్లకు వేట నిషేదం విధించింది. అయితే సంప్రదాయ పడవల నిర్వాహకులకు వేట నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ 61 రోజుల వ్యవధిలో చేపలు, రొయ్యలకు సంతానోత్పత్తి కాలమని, తల్లి చేపలు, రొయ్యలను రక్షించడానికి ప్రభుత్వం ప్రతి ఏటా సముద్రంలో మత్స్యసంపద వేటను నిషేధిస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ తెలిపారు. నిషేధ కాలంలో మడరపడవలు, మోటారు పడవల నిర్వాహకులు వేటను చేపడితే బోట్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఇచ్చే రాయితీలను నిలుపుదల చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియచేసారు. చేపలవేట నిషేధాన్ని పక్కాగా అములు చేయుటకు మత్స్యశాఖ, కోస్టుగార్డు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ అధికారుతో గస్తీ ఏర్పాటు చేస్తామని వివరించారు.
Regional Description:
చేపలవేట నిషేధం : బంగాళాఖాతంలోని సముద్ర జలాల్లో చేపలవేట చేయడాన్ని ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 15 వరకు అనగా 61 రోజులుపాటు మోటారు, మెకనైజుడ బోట్లకు వేట నిషేదం విధించింది. అయితే సంప్రదాయ పడవల నిర్వాహకులకు వేట నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ 61 రోజుల వ్యవధిలో చేపలు, రొయ్యలకు సంతానోత్పత్తి కాలమని, తల్లి చేపలు, రొయ్యలను రక్షించడానికి ప్రభుత్వం ప్రతి ఏటా సముద్రంలో మత్స్యసంపద వేటను నిషేధిస్తుందని రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ తెలిపారు. నిషేధ కాలంలో మడరపడవలు, మోటారు పడవల నిర్వాహకులు వేటను చేపడితే బోట్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఇచ్చే రాయితీలను నిలుపుదల చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియచేసారు. చేపలవేట నిషేధాన్ని పక్కాగా అములు చేయుటకు మత్స్యశాఖ, కోస్టుగార్డు, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ అధికారుతో గస్తీ ఏర్పాటు చేస్తామని వివరించారు.