News Tuesday, December 22, 2020 - 12:20

News Items: 
Description: 
క్షణాల్లో కొత్త PAN కార్డు..అది కూడా ఉచితంగా ఇప్పుడు ఆధార్ తో పాటు పాన్ కార్డు కూడా ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి అయ్యింది. దీంతో పాన్ కార్డు తీసుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. కొందరు అయితే పాన్ కార్డు చేస్తామంటూ వందలకు వందలు దోచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయపు పన్ను శాఖ ఉచితంగా పాన్ కార్డులను అందిస్తోంది. అయితే మీరు దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సులభంగానే పాన్ కార్డు పొందే అవకాశం అందుబాటులో ఉంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు వెంటనే పాన్ కార్డు లభిస్తోంది. నిమిషాల్లో మీరు మీ పాన్ నెంబర్‌ను పొందొచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్టంట్ పాన్ కార్డు సర్వీసులు అందిస్తోంది. ఆధార్ కార్డు ఉంటే చాలు.. కేవలం 10 నిమిషాల్లోనే మీరు మీ పాన్ కార్డును పొందొచ్చు. మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీ ఎంటర్ చేసి ఇకేవైసీ పూర్తి చేస్తే సరిపోతుంది. మీకు పాన్ కార్డు లభిస్తుంది. ఇందుకోసం మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ ఇఫైలింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఇన్‌స్టంట్ పాన్ కార్డు ఆప్షన్ ఓకే చేసుకోవాలి. ఇప్పుడు కొత్త పాన్ కార్డు ఆనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. దీని ఎంటర్ చేస్తే ఇపాన్ కార్డు లభిస్తుంది. www.incometaxindiaefiling.gov.in/e-PAN/ ద్వారా మీరు పాన్ కార్డు పొందొచ్చు. ఎస్ఎస్‌డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్‌సైట్స్ ద్వారా కూడా పాన్ కార్డు పొందొచ్చు. అయితే వీటి ద్వారా అయితే చార్జీలు చెల్లించాలి. అదే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సైట్ ద్వారా పాన్ కార్డుకు అప్లై చేస్తే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. అయితే ఇది ఇపాన్ మాత్రమే. అంటే మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో పాన్ కార్డు వస్తుంది. దీన్ని జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది.
Regional Description: 