News Tuesday, May 26, 2020 - 11:18
Submitted by andhra on Tue, 2020-05-26 11:18
Select District:
News Items:
Description:
వేటనిషేధ కాలం తగ్గింపు ***
సముద్రంలో చేపలవేట నిషేధ కాలాన్ని 15 రోజులకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిషేధం ఉంటుంది. ఈ ఏడాది కరోనా నియంత్రణకై మార్చి 22న లాక్ డౌన్ విధించడంతో అప్పటినుండి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మత్స్యకారులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న రీత్యా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధాన్ని సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. దీనికి స్పందించిన కేంద్రప్రభుత్వం వేట నిషేధ కాలాన్ని 47 రోజులకు తగ్గిస్తూ జూన్ 1 నుంచి సముద్రంలో చేపలవేటకు అనుమతి ఇస్తూ మే 25 వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా మత్స్యకారులు జూన్ 1 నుంచి చేపలవేటకు వెళ్ళుటకు సిద్దమవ్వాలని సూచించారు.
Regional Description: