News Saturday, May 2, 2020 - 12:28
Submitted by andhra on Sat, 2020-05-02 12:28
Select District:
News Items:
Description:
2/5/2020: ఏపీలో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు
రాష్ట్ర మత్స్యకారులెవరూ ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదని.. రెండున్నర, మూడేళ్ల వ్యవధిలో ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి మోపిదేవి వెంకటరమణ,అధికారులు హాజరయ్యారు. 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది. మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. గుండాయిపాలెం(ప్రకాశం), అంతర్వేది,ఓడలరేవు (తూర్పుగోదావరి)కు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని.. ఇప్పుడు దాదాపు రూ.3 వేల కోట్ల ఖర్చు చేసి 8 ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండ్ కట్టబోతున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలతో మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొస్తామని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.
* శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం - మేజర్ ఫిషింగ్ హార్బర్,
* శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో- ఫిష్ ల్యాండ్ నిర్మాణం.
* విశాఖపట్నం జిల్లా పూడిమడకలో∙- మేజర్ ఫిషింగ్ హార్బర్,
* తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో - మేజర్ ఫిషింగ్ హార్బర్
* పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం - మేజర్ ఫిషింగ్ హార్బర్
* కృష్ణాజిల్లా మచిలీపట్నం - మేజర్ ఫిషింగ్ హార్బర్
* గుంటూరు జిల్లా నిజాంపట్నం - మేజర్ ఫిషింగ్ హార్బర్,
* ప్రకాశం జిల్లా కొత్తపట్నం - మేజర్ షిఫింగ్ హార్బర్
* నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె - మేజర్ ఫిషింగ్ హార్బర్
Regional Description: