News Sunday, April 5, 2020 - 10:31

Select District: 
News Items: 
Description: 
మాస్క్ ఎవరికి కావాలి.. మాస్క్ ధరిస్తే ఎం చేయాలి? ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ఏకైక మార్గం వ్యక్తిగత పరిశుభ్రత. బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలన వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, ఇతరుల నుంచి మనకు, మన నుంచి ఇతరులకు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే మాస్క్ లు ధరించాలి. దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు విధిగా మాస్క్ ధరించాలి. అలాగే, కుటుంబంలో ఎవరికైన కోవిడ్ 19 సోకినట్టు అనుమానం ఉంటే ఆ వ్యక్తి కుటుంబం సభ్యులు విధిగా మాస్క్ ధరించాలి. అయితే, మాస్క్ ధరించడం పెద్ద విషయం కాదు.. కానీ ఆ మాస్క్‌ ను ఏ విధంగా వాడాలి? ఏ విధంగా డిస్పోజ్ చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఇపుడు ఇక్కడ ఆ విషయాలు తెలుసుకుందాం. * మాస్క్‌ ముడతలు ఊడదీయాలి. ఆ ముడతలు కింది వైపుకు ఉండేలా చూసుకోవాలి. * ముక్కు, నోరు, కింది దవడ కవర్‌ చేసే విధంగా, గాలి చొరబడకుండా ఉండేలా మాస్క్‌ను అడ్జస్ట్‌ చేసుకుని కట్టుకోవాలి. * ప్రతి ఆరు గంటలకూ మాస్క్‌ మార్చాలి. లేదా నీటితో తడిసినపుడు వెంటనే మార్చాలి. * మాస్క్‌ తొలగించేటప్పుడు దాని ముందరి భాగాన్ని చేతులతో తాకకూడదు. * మాస్క్‌ లను ముఖం మీద నుంచి తొలగించి, మెడలో వేలాడదీసుకోకూడదు. * డిస్పోజబుల్‌ మాస్క్‌ లను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి వాడకూడదు. వాడిన మాస్క్‌ లను మూత ఉన్న చెత్త డబ్బాల్లో వేయాలి. * మాస్క్‌ తొలగించిన తర్వాత చేతులను సబ్బుతో లేదంటే ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
Regional Description: 