News Saturday, March 21, 2020 - 13:24
Submitted by andhra on Sat, 2020-03-21 13:24
Select District:
News Items:
Description:
పరిశుభ్రతే కరోనాకి మందు
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రజలలో చైతన్య నింపే దిశగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపధ్యంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తేనే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య అధికారులు తెలియచేసారు.
విదేశాల నుంచి వచ్చిన వారు నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు కనీసం 14 రోజులు ఇంటి వద్దే ఉండాలి మరియు కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంలో ఒక గదిలో ఉండాలి. జనసంచారంలోకి వెళ్ళవద్దు. వైరస్ బారిన పడినట్లు అనుమానం ఉన్న ఏ వ్యక్తితో అయినా సన్నిహితంగా ఉంటే మీరూ ప్రత్యేక గదిలో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎవరైనా దగ్గినపుడు, తుమ్మినపుడు నోటిని ముక్కును జేబురుమాలుతో గాని, టిష్యూ పేపర్ తో గాని కప్పాలి. కరోనా వైరస్ ఉన్న ప్రాంతాలను తాకితే అవి నోరు, ముక్కు, కళ్ళు ద్వారా శరీరింలోకి సులువుగా ప్రవేశించే ప్రమాదం ఉంది. ముఖం మీదకు చేతులు వీలైనంత వరకు వెళ్ళకుండా చూసుకోవడం ఉత్తమం. తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
చేతులు సబ్బునీరు, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలి. చేతులు శుభ్రంగా ఉన్నా మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకోవడం మంచిది. ఆహారం తినేటపుడు చేతులను బాగా కడుక్కోవాలి. వాడిన టిష్యూపేపర్లు, మాస్క్ లను వెంటనే మూసిన చెత్తకుండీలో వేయాలి.
మీకు అనారోగ్యంగా ఉంటే, జ్వరం, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ దగ్గరకు వెళ్ళేటపుడు నోటిని, మక్కుని చేతిరుమాలుతో గాని, మాస్క్ తో గాని కప్పుకోవాలి. అస్వస్థతకు గురైనపుడు ఇతరులను ఎవరినీ కలవరాదు. కంటిని, నోటిని, ముక్కుని చేతితో తాకకూడదు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదు. ఆరోగ్యం ఇబ్బందికర పరిస్థితులలో ఉంటే రైలు, బస్సులలో ఆసుపత్రికి వెళ్ళకూడదు.
Regional Description: