News Sunday, September 15, 2019 - 13:45
Submitted by andhra on Sun, 2019-09-15 13:45
Select District:
News Items:
Description:
ఫిషింగ్ హబ్ గా నవ్యాంధ్ర
దేశంలోనే అత్యంత తీరప్రాంతం కలిగిన నవ్యాంధ్రప్రదేశ్‌లో వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ రంగనికి చేయూతనిచ్చి ప్రోత్సహించేందుకు సుమఖంగా ఉంది. కేంద్ర మత్స్య పరిశ్రమల శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్ గత వారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి రూ.25 వేల కోట్లమేర పెట్టుబడులు పెడతామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమల అభివృద్ధికి ప్రధానంగా తీర ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్‌లు ఏర్పాటు చేయాలని రూ.1291.40 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో రూ.289.40 కోట్లు, ప్రకాశం జిల్లా ఓడరేవుకు రూ. 409.22 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద రూ. 252 కోట్లు, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో రూ. 340.78 కోట్లతో హార్బర్ల ఏర్పాటుకు ఫిషరీస్, ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్చ్రక్చర్ డెవలప్‌మెంట్ (ఎఫ్‌ఐడీఎఫ్)కు ప్రతిపాదనలు పంపింది. ఐతే ఒక్కో ప్రాజెక్టుకు రూ.150 కోట్ల చొప్పున నాలుగు హార్బర్లకు రూ. 600 కోట్లకు బడ్జెట్‌ను పరిమితం చేసింది. ఐతే మిగిలిన నిధులను నాబార్డునుండి పొందే వెసులుబాటును కలిపించింది. ఈ ప్రతిపాదనలను సెంట్రల్ అప్రువల్ మానిటరింగ్ కమిటీలో చర్చించడం జరిగింది. ఏపీతోపాటు తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్ల ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదనలపై కూడా చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటువలన ప్రధానంగా మరపడవల సంఖ్య పెరిగి సముద్రంలోకి ఎక్కువ దూరం వెళ్లి చేపలుపట్టే అవకాశం ఉంది. అలాగే పడవలకు పార్కింగ్ సౌలభ్యం కలగనుంది. చేపలు పట్టిన అనంతరం వాటిని నిల్వచేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం లేకపోవడంతో మత్స్యకారులు పట్టిన చేపలను తక్షణమే తక్కువ ధరకు విక్రయించుతున్నారు. శీతల గిడ్డంగుల ఏర్పాటువలన మత్స్యకారులకు మెరుగైన ధరలు లభించి ఆదాయవనరులు పెరిగే అవకాశముంది. అదేవిధంగా హార్బర్లలో మౌలిక వసతులు కల్పించనున్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడం వలన సముద్రంలో మత్స్య సంపద విలువలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వేటసాగించే అవకాశం ఉంది. తుఫాను సమయంలో నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే సౌలభ్యం ఉంది. హార్బర్ల ఏర్పాటువలన మత్యకారులతోపాటు ఎక్కువ మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు గుజరాత్, మహారాష్ట్రలకు వేలదిమంది జీవనోపాధికోసం వలసలు వెళ్తున్నారు. గత ఏడాది రాష్ట్రానికి చెందిన 21 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లారన్న నెపంతో అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. వీరందరినీ విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోనే ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుచేసి ఇతర రాష్ట్రాలకు వలస వెల్లిన మత్స్యకారులను వెనక్కు రప్పించి ఇక్కడే వారికి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 974 కి.మీ. మేర తీర ప్రాంతం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్య పరిశ్రమల అభివృద్ధి ద్వారానే గత ఏడాది వ్యవసాయ రంగం 12.5 శాతం అభివృద్ధి రేటను సాధించింది. ఈతరుణంలో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధిచేసి తద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని గణనీయంగా ఆర్జించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతులతో గణనీయ పురోభివృద్ధిని సాధించే అవకాశముంది
Regional Description: