News Friday, April 26, 2019 - 08:03
Submitted by andhra on Fri, 2019-04-26 08:03
Select District:
News Items:
Description:
'ఫణి' తుఫాను దూసుకొస్తోంది
ప్రస్తుత సీజనులో తొలిసారిగా హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. కొద్ది గంటల్లోనే అది తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్ర అల్పపీడనం శుక్రవారం నాటికి దక్షిణ బంగాళా ఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం శనివారం నాటికి తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలు గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేశాయి. తుపానుగా మారిన తర్వాత 72 గంటలు శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తొలుత ఈ తుపాను తమిళనాడు వద్ద తీరం దాటవచ్చని భావించింది. మారిన పరిస్థితులనేపథ్యంలో ఇది శ్రీలంక తూర్పు తీరం వెంబడి వాయవ్య దిశగా పయనించి దక్షిణ కోస్తాంధ్ర-ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
తుపాను ప్రభావం ఈ నెల 28వ తేదీ నుంచి స్వల్పంగా మొదలై క్రమంగా పెరగనుంది. 28వ తేదీ నుంచి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో ఈదురు గాలులు ప్రారంభమై ఉధృతమవుతాయి. 28వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 29వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. భారీ ఈదురుగాలులూ వీస్తాయి. అదే సమయంలో అక్కడక్కడా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 30వ తేదీన తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెనుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావం వల్ల ఈ నెల 29వ తేదీన తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ''30వ తేదీన పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మే 1వ తేదీన కూడా తమిళనాడు, పాండిచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 29వ తేదీన దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. 30వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి'' అని ఐఎండీ ప్రకటించింది. వాయుగుండం, తుపాను నేపథ్యంలో బలమైన గాలులు వీస్తూ సముద్రం అలజడిగా మారనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 30వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు సూచించింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన 'ఫణి' పేరును ఖరారు చేయనున్నారు.
Regional Description: