News Sunday, January 6, 2019 - 11:25

News Items: 
Description: 
రైల్ టికెట్ బుక్ చేస్తున్నారా... UTS యాప్ గురించి తెలుసా? ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఐఆర్‌సీటీసీ. లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకుంటారు. ఇదే కాకుండా మరో యాప్ ద్వారా ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆ యాప్ పేరే యూటీఎస్. ఇది మన రైల్వేకు చెందిన యాప్. ఈ యాప్‌లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లాలనుకుంటే... ముందే టికెట్ రిజర్వ్ చేయించుకుంటే అది రిజర్వ్‌డ్ టికెట్. అలా కాకుండా రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా జనరల్ టికెట్ తీసుకుంటే అది అన్‌రిజర్వ్‌డ్ టికెట్. అన్ రిజర్వుడు టికెట్ ఆన్‌లైన్‌లో ఎలా తీసుకోవాలి? అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల కోసం అయితే క్యూలో నిలబడకతప్పదు. కానీ అలా క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా దర్జాగా ఆన్‌లైన్‌లోనే టికెట్ తీసుకోవచ్చు. అదే అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్. యూటీఎస్ అని పిలుస్తారు. వాస్తవానికి యూటీఎస్ స్కీమ్ నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైంది. కానీ ముంబైలో తప్ప దేశంలో ఎక్కడా ప్రయాణికులు ఈ సేవల్ని ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు దేశమంతా అందుబాటులోకి వచ్చాయి ఈ సేవలు. మూడు 'సీ'లు- క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ టికెటింగ్, కస్టమర్ కన్వినెన్స్ లక్ష్యంగా యూటీఎస్ సేవల్ని దేశవ్యాప్తంగా లాంఛ్ చేసింది రైల్వే. యూటీఎస్ యాప్ ఎలా ఉపయోగించాలి? అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల కోసం మీరు యూటీఎస్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డెవలపర్ దగ్గర సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) అని కనిపించే యాప్‌నే డౌన్‌లోడ్ చేసుకోవాలి. నకిలీ యాప్స్ కూడా ఉంటాయి జాగ్రత్త. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుక్కోవచ్చు. దూర ప్రాంతాలకూ టికెట్లు తీసుకోవచ్చు. బుక్ టికెట్, క్యాన్సిల్ టికెట్, బుకింగ్ హిస్టరీ ఇలా చాలా ఫీచర్లుంటాయి. బుక్ టికెట్‌లో నార్మల్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్‌ఫామ్ టికెట్, సీజన్ టికెట్ అని నాలుగు రకాలుంటాయి. వాటిలో మీకు కావాల్సిన టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్ వ్యాలెట్ లేదా పేటీఎం, మొబీక్విక్, ఫ్రీఛార్జ్‌ వ్యాలెట్ల నుంచి డబ్బులు చెల్లించొచ్చు. యూటీఎస్ యాప్ ఉపయోగించుకోవాలంటే... ప్రయాణికుడు రైల్వేస్టేషన్‌కు 25-30 మీటర్ల దూరంలోనే ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. ఒకేసారి 4 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రైలు టికెట్లు మాత్రమే కాదు... ప్లాట్‌ఫామ్ టికెట్స్, మంత్లీ పాస్ కూడా తీసుకోవచ్చు. https://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో కూడా మొబైల్ నెంబర్, పేరు, పాస్‌వర్డ్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు.
Regional Description: 