News Sunday, December 16, 2018 - 21:41
Submitted by andhra on Sun, 2018-12-16 21:41
Select District:
News Items:
Description:
పెథాయ్: తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? * తుపాను వచ్చినపుడు ఏం చేయాలి? తుపాను నుంచి ఎలా తప్పించుకోవాలి? తుపాను రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భారత వాతావరణ శాఖ చెబుతున్న సూచనలు మీ కోసం. * * *
తుపాను వస్తుందన్న సమాచారం అందిన వెంటనే ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. పెంకులు, పైకప్పు, తలుపులు, కిటికీలు ఎలా ఉన్నాయో చూసి తగిన మరమ్మతులు చేయాలి. ** ఇంటి పరిసరాలనూ పరిశీలించాలి. ఎండిన చెట్లు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను తొలగించాలి. గాలికి ఎగిరి వచ్చి పడే అవకాశమున్న హోర్డింగ్‌లు, ఇతర భారీ వస్తువులను తొలగించాలి. ** కిటికీల దగ్గర, గాజు పదార్థాలకు ముందు చెక్కలను అడ్డుగా పెట్టాలి. దీని వల్ల గాలికి కొట్టుకుని వచ్చి తగిలే వస్తువుల నుంచి వాటికి, ఇంటికి రక్షణ లభిస్తుంది. * * ఒకవేళ చెక్క పదార్థాలు లేకుంటే.. కిటికీలకు, గాజు పదార్థాలకు కాగితాలను అంటించాలి. * * కరెంటు పోయి నపుడు వెలుగు కోసం లాంథర్లు, కిరోసిన్ దీపాలు, ఇతర ఫ్లాష్ లైట్లు, బ్యాటరీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. * * పాడైన, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను వెంటనే తొలగించాలి. * * కరెంటు పోయినపుడు టీవీలు పని చేయవు. మరి వాతావరణ సంబంధిత హెచ్చరికలు అందుకోవడం ఎలా? అందుకోసం మొబైల్ ఫోన్లను చార్జ్ చేసి పెట్టుకోవాలి. లేకుంటే రేడియోలను సిద్ధం చేసుకోవాలి. మీకు అందిన తుపాను సంబంధిత అధికారిక సమాచారాన్ని ఇతరులకూ చేరవేయాలి. * * విపత్తు సమయాల్లో వదంతులు వ్యాపించే అవకాశం ఎక్కువ. అందువల్ల మీకు అధికారిక వెబ్ సైట్లు వార్తా సంస్థలు అందించిన సమాచారాన్నే ఇతరులకు చేరవేయండి. అనుమానాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దు. * * భారీ అలలు ఎగసి పడే అవకాశమున్న సముద్రతీరాల వద్ద తుపాను సమయంలో ఉండకూడదు. * * వరద వచ్చే అవకాశం ఉన్న చోట ఉంటే.. వెంటనే ఖాళీ చేసి పునరావాస శిబిరాలు, లేకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విలువైన వస్తువులను వీలైతే తీసుకెళ్లాలి. లేకుంటే ఎత్తైన చోట ఉంచాలి. * * వండాల్సిన అవసరం లేకుండా వెంటనే తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రెండు మూడు రోజులకు సరిపడా సిద్ధం చేసుకోవాలి. అలాగే సురక్షిత తాగునీరు, దుస్తులు కూడా. * * గాలి బలంగా వీస్తున్నపుడు దానికి ఎదుటివైపు తలుపులను, కిటికీలను తెరవకూడదు. గాలి ప్రభావం లేని వైపు తలుపులు, కిటికీలు తెరవవచ్చు. * * వేలాడే విద్యుత్తు తీగలు కనిపిస్తే వాటిన తాక వద్దు. ఆ ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అదుపులోకి వచ్చాక రిపేర్లు చేయించుకోవచ్చు. * * మీరు జాగ్రత్తగా ఉన్న సమాచారాన్ని మీ బంధువులకూ చేరవేయాలి. వాహనాలను నడుపుతున్నపుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి.
Regional Description: